కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ..



స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.


ఖాళీలు: 

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తారు. అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.


 స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులే దరఖాస్తుకు అర్హులు. వయసు: 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.


 దరఖాస్తు రుసుము: 

రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులు రుసుము ఉండదు. ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.


ఆన్లైన్ దరఖాస్తు గడువు: 

05.09.2022 కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: నవంబర్, 2022, 


వెబ్సైట్: https://ssc.nic.in/