తెలంగాణ లో  91,142 ఉద్యోగాల భర్తీ షురూ.....




📚 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే  భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఎంప్లాయిస్‌ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.



📚నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.  మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్‌ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 


🛍️ *తెలంగాణలో  గుర్తించిన ఖాళీలు 91, 142*


♦️గ్రూప్‌-1 పోస్టులు 503, 


♦️గ్రూప్‌-2 పోస్టులు 582


♦️గ్రూప్‌-3 పోస్టులు 1,373


♦️గ్రూప్‌-4 పోస్టులు 9,168  


♦️జిల్లా స్థాయిలో 39, 829 పోస్టులు.


♦️జోనల్‌ లెవల్‌లో 18, 866 పోస్టులు


♦️మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ


♦️ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు..


📚నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో..  80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌.


రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా .....*

----------------------------------------------------------

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు

గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు

గ్రూప్‌ 4- 9168 పోస్టులు


క్యాడర్ వారీగా ఖాళీలు..

జిల్లాల్లాలో- 39,829

జోన్లలో- 18,866

మల్టీజోనల్‌ పోస్టులు- 13,170

సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147


జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268

నిజామాబాద్- 1,976

మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769

రంగారెడ్డి- 1,561

కరీంనగర్- 1,465

నల్లగొండ- 1,398

కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340

భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257

సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213

ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178

మహబూబాబాద్- 1,172

హనుమకొండ- 1,157

మెదక్- 1,149

జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025

యాదాద్రి భువనగిరి- 1,010

జయశంకర్ భూపాలపల్లి- 918

నిర్మల్- 876

వరంగల్- 842

కుమ్రం భీం ఆసీఫాబాద్- 825

పెద్దపల్లి- 800

జనగాం- 760

నారాయణపేట్- 741

వికారాబాద్- 738

సూర్యాపేట- 719

ములుగు- 696

జోగులాంబ గద్వాల- 662

రాజన్న సిరిసిల్లా- 601

వనపర్తి- 556


జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..


జోన్లు..

కాళేశ్వరం జోన్‌లో- 1,630

బాసర జోన్‌- 2,328

రాజన్న జోన్‌- 2,403

భద్రాద్రి జోన్‌- 2,858

యాదాద్రి జోన్‌- 2,160

చార్మినార్ జోన్‌- 5,297

జోగులాంబ జోన్‌- 2,190


మల్టీజోన్లు..

మల్టీజోన్ 1- 6,800

మల్టీజోన్ 2- 6,370


ఏ శాఖలో ఎన్ని..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16


All Jobs Vacancy pdf


ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు: సీఎం kcr


🍥తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. SC/ ST/BC అభ్యర్థులు 49 సం.లు, దివ్యాంగులకు 54సం. వయో పరిమితిగా ఉంటుందని చెప్పారు.