విధ్యార్థులకి  అద్భుత అవకాశం - పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ (Free Coaching  with Scholorship)

👉దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 

👉ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 1500 ఖాళీలు ఉన్నాయి 

👉దీనిద్వారా 1500 విధ్యార్థులకి లాభం చేకూరుతుంది 

స్టయిపెండ్

స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్ అందిస్తారు.

ఆయా Coaching లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్ధుల బ్యాంక్ లోఖా తాలో జమ చేస్తారు.

ప్రతిభ ఉండి ఆర్ధిక సమస్యలు కారణంగా పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. స్కీమ్ ఫర్ ఫ్రీ కోచింగ్ ద్వారా భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికార విభాగం(డీఓఎస్ఈ) ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు అవసరమైన శిక్షణకు ఆర్ధిక తోడ్పాటు అందిస్తోంది. 
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు  కింద క్లిక్ చేయండి. 
👇👇👇

అర్హత

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలలోపు ఉండాలి.

👉కింద పరీక్షలకు మాత్రమే ఉచిత కోచింగ్ ఇవ్వబడును 

ఉద్యోగ పరీక్షలు: 

యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ఎ,బీ స్థాయి ఉద్యోగాలు, ఎస్ఎస్ బీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఆర్ఆర్ బీ) చేపట్టే నియామకాలు, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు చేపట్టే ఆఫీసర్ స్థాయి కొలువులకు సంబంధించిన పరీక్షల కోచింగ్ కు ఫీజు చెల్లిస్తారు.

ఎంట్రన్స్ టెస్టులు: 
ఐఐటీ జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్, సీడీఎస్, ఎ డీఏ, జీఆర్మ్, శాట్, జీమ్యాట్, టోఫెల్ లాంటి ఎంట్రన్స్ టెస్టులకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణకు అవసరమైన ఫీజు చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2021