💥తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల.. 2022-23



🔶ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ.


*🔷ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్ష*


షెడ్యూల్ను విడుదల చేసిన అధికారులు..



👉రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్‌ స్కూల్స్‌) 2022-23 విద్యాసంవత్సర ప్రవేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు.ఆదివారం నోటిఫికేషన్‌ వెలువడనున్నది. 

👉వచ్చే నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 20న ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 194 మోడల్‌ స్కూళ్లలో 6-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.


👉6వ తరగతిలో మొత్తంగా 19,400 సీట్లను నింపనున్నారు. 7-10 తరగతుల్లో ఖాళీలను బట్టి సీట్లను భర్తీ చేస్తారు.

 👉ఈ ప్రవేశాల కోసం విద్యార్థులు telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.150, వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ.75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.👇👇


Notification pdf & Schedule