గ్రూప్-3, 4, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీసీ స్టడీసర్కిళ్లలో ప్రత్యక్ష తరగతులు
తెలంగాణ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి గ్రూప్3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించను న్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్కు మార్ తెలిపారు. గ్రూప్-3, 4 శిక్షణ కోసం పది, , డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొ న్నారు.
అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 04024071178 లేదా 040-27077929 ఫోన్ నంబ ర్లలో సంప్రదించాలన్నారు.