💥 రిట్స్

రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి రాజ్యాంగంలో 32వ అధికరణంలో పొందుపర్చారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కంచెగా, వలయంగా, భద్రతా వలయం గా రాజ్యాంగ పరిహారపు హక్కును పేర్కొంటారు.


– రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు ఆత్మగా, హృదయంగా, కవచంగా ఉపయోగపడుతుందని డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు.


-ప్రజల ప్రాథమిక హక్కులను ఎవరైనా ఉల్లంఘిస్తే లేదా హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 32వ అధికరణం ద్వారా, రాష్ర్టాల్లో హైకోర్టులు 226వ అధికరణం ప్రకారం 5 రకాల రిట్లు జారీ చేసి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి.


*-రిట్స్ అంటే* న్యాయస్థానాలు జారీచేసే ఆజ్ఞలు లేదా ఆదేశాలు వీటిని తప్పని సరిగా పాటించాలి.


*-రిట్స్ జారీ చేసే ప్రక్రియను బ్రిటన్ నుంచి స్వీకరించారు.


-32 (1) అధికరణం ప్రకారం ప్రజల హక్కులకు అవరోధం ఏర్పడితే ప్రజలు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.


-32 (2) అధికరణం ప్రకారం న్యాయస్థానాలు 5 రకాల రిట్లు జారీ చేస్తాయి.


-అవసరమైతే రిట్లు జారీచేసే అధికారాన్ని భారత పార్లమెంటు జిల్లా స్థాయి న్యాయస్థానాలకు ఇవ్వవచ్చు (కానీ ఇప్పటివరకు ఆ అధికారం ఇవ్వలేదు) అని 32 (3)వ నిబంధన తెలుపుతోంది.


-రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రజల పాలిట రక్షణ కవచం. భారత రాజ్యాంగం మొత్తంలో అత్యంత కీలకమైనది. ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించేదిగా దీనిని పరిగణిస్తారు.


*-కనుభాయ్ బ్రహ్మభట్ వర్సెస్ గుజరాత్ కేసులో పౌరులు తమకు రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తే ముందుగా రాష్ట్ర అత్యున్నత కోర్టును ఆశ్రయించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది*.


💥 రిట్లు ఐదు రకాలు. అవి..

1. హెబియస్ కార్పస్ – బందీ ప్రత్యక్ష అధిలేఖ


2. మాండమస్ – పరయాదేశ అధిలేఖ


3. ప్రొహిబిషన్- నిషేధ ఆజ్ఞ


4. సెర్షియోరరీ – ఉత్ప్రేషణ అధిలేఖ


5. కోవారెంటో – అధికార పృచ్ఛ

 ఈ 5 రకాల రిట్లను సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే జారీ చేసి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి.


💥 ప్రొహిబిషన్

-దీనిని ప్రతిశేధ అధికార లేఖ (Prohibition) అని అంటారు.

-ప్రొహిబిషన్ అంటే నిషేధపూర్వక ఆదేశం.

-ఏదైనా ఒక అధీన న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమిస్తే అటువంటి చర్యలను నిలిపివేయమని సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే ఆజ్ఞ ప్రొహిబిషన్.

-కింది స్థాయి న్యాయస్థానాలను పై స్థాయి కోర్టులు నియంత్రణ చేసేది ప్రొహిబిషన్.


💥 సెర్షియోరరీ

-సెర్షియోరరీ లేదా ఉత్ప్రేషణ అధిలేఖ అంటే ధృవీకరణ చేయడం (To be Certified) అని అర్థం.

-కింది స్థాయి న్యాయస్థానాల్లో విచారించబడిన కేసును నిలుపుదల (Prohibition) చేసి పై స్థాయి కోర్టుకు ఆ కేసును బదిలీ చేసి ధృవీకరణ చేసే ఆదేశం సెర్షియోరరీ.

-అధీన న్యాయస్థానంలో విచారించబడుతున్న కేసును నిలుపుదల చేసేది ప్రొహిబిషన్, కేసును పరిశీలించి తీర్పు ప్రకటించిన తరువాత ఈ రికార్డులను పై స్థాయి న్యాయస్థానాలకు పంపమని ఆదేశించేది *సెర్షియోరరీ.*

-కేసును నిలుపుదల చేసేది ప్రొహిబిషన్, కింది స్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సవరించేది సెర్షియోరరీ.

-మాండమస్ ఒక పని చేయాలని ఆదేశిస్తే, ప్రొహిబిషన్ ఒక పని చేయరాదని ఆజ్ఞాపిస్తుంది. సెర్షియోరరీ తీర్పులోని సవరణలను సరిచేస్తుంది.

-ప్రొహిబిషన్, సెర్షియోరరీ అనే రిట్లు ఉన్నత న్యాయస్థానాలు, అధీన న్యాయస్థానాలపై జారీ చేసే ఆజ్ఞలు (రిట్లు). వీటిని న్యాయసంబంధమైన ఆజ్ఞలు అని కూడా అంటారు.

-నిషేధ ఆజ్ఞతో కలిపి జారీ చేయబడేది సెర్షియోరరీ.


💥 కోవారెంటో

-కోవారెంటో (అధికార పృచ్ఛ) అంటే ఏ అధికారంతో (To What Authority) అని అర్థం.


-ఒక ప్రభుత్వ అధికారి చట్టపరమైన అర్హతలు లేకుండా అధికారం నిర్వహిస్తుంటే, ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఆ అధికారాన్ని నియంత్రించడం కోసం న్యాయస్థానాలు కోవారెంటో అనే ఉత్వర్వును జారీ చేస్తాయి.


-కోవారెంటో అనే అప్పీలు జారీ చేయాలని న్యాయస్థానాలను కోరితే సరైన కారణం లేకపోతే ఈ రిట్ నిరాకరించబడుతుంది.


-కోవారెంటో రిట్ వల్ల అధికారులు తమ అధికార పరిధిని అతిక్రమించకుండా, అధికారం దుర్వినియోగం చేయకుండా, ప్రజల పదవులు దుర్వినియోగం కాకుం డా న్యాయస్థానాలు ఈ రిట్ జారీ చేస్తాయి.


-ప్రభుత్వ అధికారి తన అధికార పరిధిలోకి రాని విషయంలో జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వు కోవారెంటో.


హెబియస్ కార్పస్

-రిట్లు జారీ చేయడానికి ఉపయోగించిన పదాలు లాటిన్ భాష పదాలు.

-హెబియస్ కార్పస్ అంటే To Have the Body అని అర్ధం. హెబియస్ అంటే Have, కార్పస్ అంటే Body అని అర్థం.

-హెబియస్ కార్పస్ అంటే వ్యక్తిని ప్రవేశపెట్టండి అని అర్థం లేదా ఆజ్ఞాపించడం.

-నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపు శారీరకంగా న్యాయస్థానంలో హాజరు పర్చాలని జారీ చేసే ఉత్తర్వే హెబియస్ కార్పస్.

-ఇది ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కును పరిరక్షిస్తుంది.

-ఈ రిట్‌ను ప్రభుత్వాలపై, సంస్థలు, వ్యవస్థలు, ప్రయివేటు వ్యక్తులపై జారీ చేయవచ్చు.

-ఈ రిట్‌ను భారత రాష్ట్రపతిపై, రాష్ర్టాల గవర్నర్లపై, విదేశీయులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు జారీ చేయకూడదు.

-ఇంగ్లండ్‌లో హెబియస్ కార్పస్ చట్టం 1679లో అమల్లోకి వచ్చింది.


మాండమస్

-మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం (We Command) అని అర్థం.


-ఒక ప్రభుత్వ అధికారి గానీ, ఒక చట్టబద్ధమైన సంస్థ గానీ క్వాజీ, పబ్లిక్ సంస్థ గానీ తమ విధులను నిర్వర్తించనప్పుడు విధులు నిర్వహించమని ఆదేశించడమే మాండమస్.


-ప్రయివేటు వ్యక్తులపై, సంస్థలపై ఈ రిట్‌ను జారీచేయరు.


-ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు విధులు నిర్వర్తించేవిధంగా న్యాయస్థానాలు ఆదేశించడం వల్ల పాలనలో జాప్యం నివారించబడి ప్రజలకు న్యాయం జరుగుతుంది.


-భారతదేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో న్యాయస్థానాలు రిట్లు జారీ చేయవు.


-మార్షల్ లా (సైనిక శాసనం) అమల్లో ఉన్న సమయంలో కూడా రిట్లు జారీచేయవు.


-జైలుశిక్ష అనుభవించే ఖైదీలకు న్యాయస్థానాల హెబియస్ కార్పస్ రిట్ వర్తించదు.


-1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 32 (A) అధికరణం చేర్చి ప్రభుత్వ శాసనాల రాజ్యాంగ బద్ధతను 32వ అధికరణం పరిధిలో న్యాయస్థానాలు ప్రశ్నించకూడదని రాజ్యాంగ సవరణ చేశారు.


-1978లో 43వ రాజ్యాంగ సవరణగా 32 (A) అధికరణం తొలగించి పూర్వ అధికారాలను పునరుద్ధరించారు.


-భారత సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా రిట్లు జారీచేస్తుంది.


-రిట్లు జారీ చేయడం సుప్రీంకోర్టు విచక్షణ అధికార పరిధిపై ఆధారపడలేదు. వీటిని జారీ చేయకుండా సుప్రీంకోర్టు నిరాకరించే అవకాశం లేదు. అందుకే రిట్లను రెమెడియల్ రైట్స్ (Remedial Rights) అంటారు.


-న్యాయస్థానాలు ఇంజక్షన్, లోకస్ స్టండి, ప్రజాప్రయోజనాల వాజ్యం, సుమోటో అనే పదాలను ఉపయోగించి ప్రజా సమస్యలను నివారిస్తు న్యాయ రక్షణ కోసం కృషి చేస్తున్నాయి.


*-ఇంజక్షన్ ఆర్డర్, లోకస్ స్టండి, ప్రజాప్రయోజనాల వాజ్యం, సుమోటో అనే పదాలు రాజ్యాంగంలో పొందుపర్చబడిలేవు*.


-న్యాయస్థానం ఒక పనిని చేయమని మ్యాండేటరీ ఇంజక్షన్, ఒక పని చేయకుండా నిలుపుదల చేయమని రిస్ట్రిక్ట్రివ్ ఇంజక్షన్‌ను జారీ చేస్తుంది. సివిల్ చట్టాల ప్రకారం జారీ చేసేది ఇంజక్షన్. ఇది రిట్ కాదు. రాజ్యాంగంలో లేదు.


-ఇంజక్షన్ ఆర్డర్‌ను నష్టనివారణ కోసం ప్రయివేటు వ్యక్తులపై జారీ చేస్తారు.


-లోకస్ స్టండీ అంటే ఎవరి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినవో వారు న్యాయస్థానానికి సమస్యను విన్నవించుకునే హక్కు లేదా అధికారం కలిగి ఉండటం.


-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది.


-ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు సంబంధిత వ్యక్తులు అవగాహనలేక, నిరక్షరాస్యత కారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించలేనప్పుడు వారి తరఫున ప్రజాసంఘాలు, లేదా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(PIL) ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.


-పత్రికారంగాన్ని ఫోర్ట్ ఎస్టేట్ అని ఎడ్మండ్ బర్క్ పేర్కొన్నాడు.


-పత్రికల్లో, ప్రసార సాధనాల్లో వచ్చిన అంశాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు స్వయం ప్రేరిత (Sumoto) కేసులుగా విచారించవచ్చు.

ఉదా: ప్రభుత్వ వైద్యశాలల్లో పసిబాలుడ్ని ఎలుకలు కరవడం వల్ల మరణించగా కోర్టు తనకు తానుగా విచారణకు స్వీకరించడం.


-సుప్రీంకోర్టు ప్రాదేశిక పరిధి రిట్లు జారీ చేసే విషయంలో ఎక్కువ, హైకోర్టు ప్రాదేశిక పరిధి తక్కువ. అంటే సుప్రీంకోర్టు భారతదేశం మొత్తానికి వర్తించేలా రిట్లు జారీ చేస్తే హైకోర్టు మాత్రం ఆ రాష్ట్ర పరిధిలో జారీ చేస్తుంది.